Roja: ప్రజలను ఫూల్స్‌ని చేస్తున్నారు 4 d ago

AP: ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేయడం ఏపీలోనే జరుగుతుందని విమర్శించారు వైసీపీ నాయకురాలు రోజా. సీఎం చంద్రబాబు ఒకే పథకాన్ని మళ్లీ మళ్లీ ప్రారంభిస్తున్నారని, ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారే ప్రారంభిస్తారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చారని, కానీ జగన్ మోహన్ రెడ్డి 66 లక్షల 34 వేల 742 మందికి పింఛన్లు అందజేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 63 లక్షల 59 వేల మందికి మాత్రమే పింఛన్లు ఇస్తుందని, దాదాపు 3 లక్షల పింఛన్లను తొలగించారని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమం కోసం జగన్ దాదాపు 2 లక్షల 72 వేల కోట్ల రూపాయలు ఇచ్చారని, అంతటి సంక్షేమాన్ని తాము ఇచ్చే పింఛన్‌తో సమానమని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. ఆయన ప్రజలను ఫూల్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారని, అధికారంలోకి రాక ముందు సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని మోసం చేశారన్నారు. వాలంటీర్లను రోడ్డుపైకి ఈడ్చారని, మహిళలకు రూ.1500 ఇస్తామని చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు భృతి, అమ్మ ఒడి పథకాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలకు చేస్తున్న పనులకు సంబంధం లేదన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం రాకపోతే చంద్రబాబు దిగిపోవాలని డిమాండ్ చేశారు.